మినీడెయిరీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎస్సీల సంక్షేమానికి సీఎం కృషి👈
- రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంది👈
- అన్ని కులాలకు జీవనోపాధి -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు👈
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతున్న రైతు సంక్షేమం కోసం సీఎం కేసిఆర్, వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని కెఆర్ గార్డెన్ నందు
ఎమ్మేల్యే డాక్టర్ టి.రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పోరేషన్ మినీడైరీ మంజూరి పత్రాలను లబ్దిదారులకు అందజేయు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎందని పేర్కొన్నారు. భూముల క్రమబద్దీకరణ కోసం నూతన రెవిన్యూ చట్టం, నియంత్రిత సమగ్రనూతన వ్యవసాయ విధానం, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని తెలిపారు. ముదిరాల జీవనోపాధికి ఉచిత చేపపిల్లలు,
గొల్లకురుమలకు గొర్లను, ఎస్సీలకు మూడు ఎకరాల భూమితోపాటు మెరుగైన పథకాలు అమలు చేశారని వివరించారు. రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆనాడు పట్వారీ వ్యవస్థను రద్దు చేయగా నేడు సీఎం కేసిఆర్ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని చెప్పారు. ఆసరా ఫింనచ్లు, కళ్యాణలక్ష్మి, కార్పోరేట్ స్థాయిలో గురుకుల పాఠశాలలు, దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ దని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య కోరిన విధంగా నియోజకవర్గానికి అన్ని విధాలుగా అండగా ఉండి అభివృద్ధి చేస్తాననిహామీ ఇచ్చారు.
ఎమ్మేల్యే రాజయ్య మాట్లాడుతూ... నియోజకవర్గంలో మొట్టమొదటి సారి మూడు మండలాల భారీ మినీడైరీ పైలెట్ ప్రాజెక్టులు మంజూరి చేయడం జరిగిందని అన్నారు. అందులో లింగాలఘనపురం 95, రఘునాథపల్లి 194, స్టేషన్‌ఘనపూర్ 195ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున మొత్తం 484మందికి మజూరి చేయడం జరిగిందని తెలిపారు. అందులో 60 శాతం సబ్సిడీపోను 40శాతం బ్యాంకులోను చెల్లించాలని తెలిపారు.
మినీడైరీ కొట్టాలను నిర్మించుటకు రూ.94వేలుమంజూరి చేస్తామని పేర్కొన్నారు.
త్వరలో చిల్పూరు. జఫర్‌గడ్ మండలాలకు మినీడైరీ లోన్లు త్వరలో మంజూరి చేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో జడ్పీచైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.నిఖిల, జనరల్ మేనేజర్ హైదరాబాద్ ఆనంద్ కుమార్, ఎస్సీకార్పోరేషన్ ఈడీ కోర్నెలియస్, జడ్పీసీఈఓ రమాదేవి, కుడా అడ్వెజరీ కమిటీ సభ్యులు ఆకుల కుమార్, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు టి.సురేష్ కుమార్, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పండ్లు, ఎంపీటీసీలు, మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.👈
Comments
Post a Comment